కేసీఆర్ విమానం కొనుగోలుపై రేవంత్ సెటైర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సెటైర్ వేశారు. కేసీఆర్.. దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదని తప్పుబట్టారు. ప్రగతిభవన్‌ను ఏనాడు వీడిలేదని, ఫాంహౌస్ దాటని కేసీఆర్.. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడని రేవంత్ మండిపడ్డారు.

కేసీఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా తిరిగేందుకు ఆయన విమానాన్ని కొనుగోలు చేయాలని భావించారు. రూ.100 కోట్లతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ నేతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. దసరా పండుగ తర్వాత విమానాన్ని కొలుగోలు చేసేందుకు ఆర్డర్ చేస్తారని చెబుతున్నారు. విమానం కొనుగోలు కోసం
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు, ఒకరు నల్లగొండ జిల్లా నుంచి ఒకరు, మరొకరు కరీంనగర్‌ జిల్లాకు చెందిన నేత విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.