సికింద్రాబాద్‌లో కిడ్నాప్.. చేధించిన పోలీసులు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఓ చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు ఓ మహిళ తన బిడ్డతో వచ్చింది. అనుకోకుండా మరో మహిళ ఈమెకు పరిచయమైంది. ఆ మహిళ ముందుగానే ఆ తల్లిని నుంచి బాబును ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేసుకుంది. అనుకున్నట్లుగా తల్లికి బిడ్డకు బిస్కట్లు, ఇతర తినుబండాలు ఇచ్చి నమ్మించింది. ఈ క్రమంలోనే తల్లితో మంచిగా నటిస్తూ.. మంచిగా మెలిగింది. సికింద్రాబాద్ దిగగానే ఆ తల్లి బాబును ఆమెకు అప్పగించి వాష్‌రూమ్‌కి వెళ్లింది.

తల్లి వాష్ రూం వెళ్లగానే ఆ మహిళ బాబుతో ఉడాయించింది. కంగారు పడిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి కోసం పోలీసులు రంగంలోకి దిగారు. మహిళలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. సీసీ పుటేజీ ఆధారం ఈ కేసును పోలీసులు చేధించి… బాబును తల్లికి అప్పగించారు. వెంటనే స్పందించి తల్లిబిడ్డలను ఒకటి చేయడంతో పోలీసులను మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.