12 మెట్ల కిన్నెర మొగులయ్యకు పవన్ ఆర్థిక సాయం

12 మెట్ల కిన్నెర మొగులయ్యకు పవన్ ఆర్థిక సాయం

ఆర్.బి.ఎం డెస్క్: 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ‘భీమ్లానాయక్’ చిత్రంలో హీరోను పరిచయం చేసే గీతానికి మొగులయ్య సాకీ ఆలపించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కళలు, జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలని కోరారు. ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ద్వారా.. రూ.2 లక్షలు మొగులయ్యకు పవన్‌ అందించనున్నారు. తెలంగాణలోని అమ్రాబాద్‌ రిజర్వు ప్రాజెక్టుకు చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడని పవన్ కొనియాడారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మొగులయ్యకు పవన్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న ‘బీమ్లానాయక్‌’ చిత్రంలో టైటిల్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న మొగులయ్య పాడిన పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అయితే 10 గంటల్లో ఈ పాటకు 6 లక్షల మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మొగులయ్య తండ్రి ఎల్లయ్య వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెరను 12 మెట్లగా మార్చారు. అంతరించి పోతున్న మొగులయ్యను తెలంగాణ మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వ నెల రూ. 10 వేలు ఫెన్షన్ ఇస్తోంది. అంతేకాదు ఆయన జీవిత గమనాన్ని ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.

Leave a Reply

Your email address will not be published.