వాళ్ళని వదలకండి.. తాట తీయండి: సీఎం కెసిఆర్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు. డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. డ్రగ్స్ నివారణకై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలనీ సీఎం కెసిఆర్ సూచించారు. ఈ నెల 28 న ప్రగతి భవన్ లో డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులు, హోమ్ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రులతో సీఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎంతటివారినైనా వదిలేది లేదని కెసిఆర్ తెలిపారు. మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వారిని వదలకూడదని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.