గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్దాం: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్దాం: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెల్దామని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగం జనవరి 26న అమలులోకి వచ్చిందన్నారు. ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించుకుని ఆ విలువలకోసం పాటుపడాలన్నారు. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని చాటే విధంగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించు కోవాలని ఆయన కోరారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు,విలక్షణమైన సామాజిక భిన్నత్వాన్ని కూడిన ఏకత్వాన్ని ప్రదర్శించడమే భారతదేశ గొప్పతమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితర మహానేతలతో పాటు రాజ్యాంగం రూపకల్పన సారధి డా.బి.ఆర్ అంబేద్కర్ తదితర రాజ్యాంగ పరిషత్ సభ్యుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత దేశాన్ని అగ్రగామి రాజ్యంగా మార్చేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.