తల నరుక్కుంటా.. రాళ్లతో కొట్టండి అంటూ కెసిఆర్ మొదలుపెట్టిన తిట్ల పురాణం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: లంగా, లపంగి, సన్నాసి, లుచ్చా, సాలే, బట్టలు విప్పి కొడతా.. ఈ తిట్లన్నీ ఎవరో సమాన్యుడి నోటి నుంచి వస్తున్న తిట్లు కాదు. ప్రజల చేత ఎన్నుకోబడి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ తిట్లుకు సీఎం కేసీఆర్ సాధికారత కల్పించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఆయన ప్రజలను ఆకర్షించాడానికి ఆ సమయంలో ఏ మాట నోటికొస్తే అంతమాట అంటారు. కేసీఆర్ నోటి నుంచి ఇప్పటికిప్పుడు వస్తున్నవి కావు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి మాటలతోనే ప్రజలను ఆకర్షించారు. అయితే అప్పుడు కేసీఆర్ ఉద్యమనాయకుడు ఆ సందర్భంగా అందరూ చూసిచూడనట్లు వదిలేశారు. కేసీఆర్ తెలంగాణ సీఎం అయిన తర్వాత కూడా ఇదే జోరులోనే మాట్లాడారు. ఆయన మాటల్లో సమయం సందర్భం అంటూ ఏమి ఉండదు. ‘‘తల నరుకుంటా. రాళ్లతో కొట్టండి. ప్రతికలను ప్రతిపక్షాలను పాతాళంలోకి తొక్కేసా’’ అని అవవోకగా సీఎం మాట్లాడుతుంటారు. అయితే ప్రస్తుతం ఆయన మాటల్లో కాస్త మార్పు కనిపిస్తోంది.

ఆయన జోరును ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బండి సంజయ్‌పై తీవ్రమైన పదజాలంతో దూషించారు. అంతేకాదు బండి సంజయ్ రంకు బయటపెడుతానని హెచ్చరించారు. అంతే ధీటుగా మైనంపల్లికి సంజయ్ సమాధానం కూడా చెప్పారు. అయితే వీరిద్దరూ విసుకున్న తిట్ల పురాణంపై అంతపెద్ద చర్చ జరుగులేదు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చాలా విమర్శలు వచ్చాయి. మంత్రి స్థానంలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో నందమూరి హీరోల్లాగా తొడగొట్టి మరీ రేవంత్ సవాల్ విసిరారు. ఇంతవరకు బాగానే ఉంది. అంతటితో ఆగకుండా పరుష పదజాలంతో రేవంత్‌రెడ్డిని లుచ్చా అని సంభోదించారు. రాగద్వేషాలకు వ్యతిరేకంగా ఉంటానని రాజ్యాంగంపై మల్లారెడ్డి ప్రమాణం చేశారు. ఆయన చేసిన ప్రమాణాలను పక్కనపెట్టి తిట్లు వర్షం కురిపించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడడంతో ఎంతవరకు సబబు అని మాట్లాడుకుంటున్నారు. పైగా ఆయన కాలేజీల్లో భావిభారత పౌరులను తయారు చేస్తున్నారు. కాలేజీల్లో చదివే విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడుతుందోననే అనుమానం కూడా కలుగుతుంది.

పోని ఇక వీళ్లను వదిలేద్దాం. మరీ రేవంత్‌రెడ్డి మాటేమిటీ. కేసీఆర్ ఎంత ఘాటుగా విర్శలు చేస్తారో… అంతే ఘాటుగా రేవంత్ కూడా విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కూడా అదేస్థాయిలో రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొవాలంటే ఇదే స్థాయిలో మాట్లాడితేనే సరిపోతుంది అనుకుంటారేమో కాబోలు. ఇక బండి సంజయ్ తమకు ఆర్‌ఎస్‌ఎస్ సంస్కారం నేర్పిందని చెబుతుంటారు. ఆయకు వీళ్లకేమీ తీసిపోరు. కాస్త అటుఇటుగా మాట్లాడుతుంటారు. నేతలు వాళ్ల నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా.. మీడియా మాత్రం ప్రేక్షకప్రాత వహిస్తోంది. అరిపోయిన టేప్ రికార్టు లాగా పదేపదే నేతల విమర్శలను చూపెడుతూ రేటింగ్‌లను పెంచుకునేందుకు చేసే తాపపత్రంలో ఉందే తప్పా… ఇలాంటి వ్యాఖ్యలను తప్పుబట్టదు.

Leave a Reply

Your email address will not be published.