హుజురాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్

హుజురాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ క్యాండేట్ సెలక్షన్ పై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇంకా ఆలస్యం చేయకుండా అభ్యర్థిని ప్రకటించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా సోనియా ఆదేశాలతో ఏఐసీసీ ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ రంగం లోకి దిగారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అటు బీజేపీ ఇటు టిఆర్ఎస్ సర్వ శక్తులు పెట్టి శ్రమిస్తున్నాయి. బలగాన్ని మొత్తం దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అటు బీజేపీ సైతం ఊరు వాడ చుట్టేస్తోంది. ఈటెల రాజేందర్ అక్కడే మకాం వేసి క్యాంపెన్ చేస్తున్నారు. అయితే అటు ప్రచారంలో ఇటు అభ్యర్థి విషయంలో ఆ రెండు పార్టీలతో పోల్చు కుంటే కాంగ్రెస్ వెనుకబడి పోయింది.

రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరాలతో దూకుడు పెంచింది. దాంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక అదే ఊపుతో హుజురాబాద్ ఉప ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఇంకా జాప్యం చేయకుండా అభ్యర్థిని ప్రకటించుకుని వెంటనే ప్రచార పర్వంలోకి దూకాలని డిసైడ్ అయింది. అందుకోసం ఏఐసీసీ రంగంలోకి దిగింది. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సి హ్మ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. దాంతో ఆయన నియోజకవర్గంలో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ మేరకు ముగ్గురు పేర్లతో ఓ జాబితాను సిద్ధం చేసి టీపీసీసీకి అందజేశారు. అందులో బీసీ నుంచి కొండా సురేఖ, ఓసి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సి సామాజిక వర్గం నుంచి దయాసాగర్ పేర్లను ప్రతి పాదించారు. టీపీసీసీ ఆ జాబితాను ఏఐసీసీకి పంపించింది. ముగ్గురి పేర్ల నుంచి ఫైనల్ క్యాండేట్ ను సెలక్షన్ చేసే బాధ్యతను సోనియాగాంధీ ఇంచార్జీకి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే టీపీసీసీలో మెజారిటీ నేతలు కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా పేరే ఫైనల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆమె పేరుతో అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. ఇక రేపటి సమావేశంలో ఉప ఎన్నికల ప్రచార వ్యూహాల ను ఖరారు చేయనున్నారు. దాంతో పాటు గజ్వేల్ లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభమీద నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published.