కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లిన స్టాలిన్!

కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లిన స్టాలిన్!

ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆశలు అడిషాయలైనట్లేనా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఓ దఫా వివిధ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఏమైందో ఏమోగాని కానీ మౌనంగా అయ్యారు. తిరిగి ఇప్పుడు షురూ చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలుస్తారని చెబుతున్నారు. అయితే ఇందతా బాగానే ఉంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల సహకారం లేకుండా సాధ్యం కాదు.

నిన్న తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ ఆశలపై నీళ్లు పోసినట్లుగా ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ రచించిన ‘ఒంగళిల్‌ ఒరువన్‌’ (మీలో ఒకడిని) పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రాలకు మరిన్ని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో సవరణలు చేయడానికి కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయ్, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు టీడీపీ నేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందలేదు. ఈ ముగ్గురు నేతలను పిలువకపోవడానికి కారణాలున్నాయని పలువురు అంటున్నారు. కేసీఆర్ ఆలోచనకు భిన్నంగా కాంగ్రెస్‌తో స్టాలిన్ జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో స్టాలిన్‌ను కలువాలని కేసీఆర్ అనుకుంటున్న తరుణంలో.. రాష్ట్రాల హక్కుల కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని స్టాలిన్ పిలుపునివ్వడం కేసీఆర్‌కు స్టాలిన్ షాకేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.