సికింద్రాబాద్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

సికింద్రాబాద్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజును సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెరాస నాయకత్వం విభిన్నంగా నిర్వహించింది. వివిధ సేవా కార్యక్రమాలను ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ నేతృత్వంలో తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ ఆర్ధిక సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న సికింద్రాబాద్ కు చెందిన శంకర్ యాదవ్ కు ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆర్ధికంగా ఊరటను కలిగించారు. నిమ్స్ వైద్యులను సంప్రదించి రూ. రెండు లక్షల మేరకు నిధలను ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించి శనివారం ఆ మంజూరు పాత్రలను శంకర్ యాదవ్ కు అందించారు. అదే విధంగా సీతాఫలమండీ బీదల బస్తీ కి చెందిన శ్రీమతి లలితమ్మ కు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఆమె అభ్యర్ధన మేరకు ‘ గిఫ్ట్ ఏ స్మైల్ ‘ లో భాగంగా రూ. 60 వేలకు పైగా సొంత నిధులతో ఎలక్ట్రికల్ రుబ్బు రోలు, ప్యాకింగ్ యంత్రం వంటి వివిధ పరికరాలను సమకూర్చారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ పరికరాలను జన్మ దిన కానుకగా శ్రీమతి లలితమ్మకు తీగుళ్ల పద్మారావు గౌడ్ అందజేశారు, శ్రీమతి లలితమ్మ ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ కు కృతఙ్ఞతలు తెలిపారు. అదే విధంగా మెట్టుగూడా డివిజన్ కు చెందిన చింత బావి, విజయపురి కాలనీ యువజన సంఘాలకు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి రసూరి సునీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా క్రికెట్ కిట్లను పద్మారావు గౌడ్ అందచేశారు. ఈ కార్యక్రమాల్లో తెరాస యువ నేతలు తీగుళ్ల కిషోర్ కుమార్, తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published.