అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. సామాజిక అసమానతలును ఛేదించిన కాంతి రేఖ పూలే: శుభప్రద్ పటేల్,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు

అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. సామాజిక అసమానతలును ఛేదించిన కాంతి రేఖ పూలే: శుభప్రద్ పటేల్,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు

ఆర్.బి.ఎం హైదరాబాద్: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే అని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడని ఆయన అన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా,కాంతి రేఖగా నిలిచారన్నారు. అటువంటి ఉద్యమకర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయ వాది, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ను యువత స్పూర్తిగా తీసుకోవాలని శుభప్రద్ పటేల్ కోరారు. పూలే ఆశయాలకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడు తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందని ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.