దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న శంకర్ పల్లి పోలీసులు..
ఆర్.బి.ఎం శంకర్ పల్లి: గత కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన దారి దోపిడీ దొంగల ముఠాను శంకర్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గత కొద్దిరోజులుగా రాత్రి వేళల్లో శంకర్ పల్లి పోలీస్ స్టేషన్స్ పరిధిలో దారి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు.
గ్రామాల్లోకి వచ్చే మార్గంలో రాత్రి 11 గంటల సమయంలో అటుగా వచ్చే వాహనాలను ఈ ఆరుగురు దుండగులు నిలిపి వాహనదారులను మాటల్లో పెట్టి వారి వద్ద ఉన్న మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడుతూ దుండగులు చెప్పిన విధంగా నగదు,బంగారం ఇవ్వకపోతే వాహనదారులపై దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితుల పిర్యాదు మేరకు శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు.