తెరాస కంచుకోటగా సికింద్రాబాద్ నియోజకవర్గం: పద్మారావు గౌడ్,ఉప సభాపతి

తెరాస కంచుకోటగా సికింద్రాబాద్ నియోజకవర్గం: పద్మారావు గౌడ్,ఉప సభాపతి

ఆర్.బి.ఎం సికింద్రాబాద్ : మొత్తం తెలంగాణా రాష్ట్రం లోనే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వివిధ ప్రత్యేకతలతో నిలిచిందని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఐదు మునిసిపల్ డివిజన్లను తమ పార్టీ కైవసం చేసుకో గలిగినదని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస విస్తృత స్థాయి సమావేశం గురువారం సితాఫలమండీ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సమితికి సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కంచు కోటగా మార్చమని తెలిపారు. కార్పొరేటర్లు, నాయకులు సైతం పార్టీ కార్యకర్తల కృషి కారణంగానే తమ గుర్తింపును పొందుతున్నారని పద్మారావు గౌడ్ అన్నారు.

వచ్చే నెల 15 వ తేదిన వరంగల్ లో జరిగే విజయ గర్జన సభకు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 15 నుంచి 25 వేల మందిని తరలిస్తామని అయన తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస శ్రేణులకు తాము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, తమ సమస్యల పై కలుసుకోవచ్చునని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేటర్లు కుమారి సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, శ్రీమతి రాసురి సునిత రమేష్, తెరాస యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.