మల్లెపల్లిలో మద్యం మత్తులో డ్రైవర్ హల్చల్.. ఇద్దరికి గాయాలు..

మల్లెపల్లిలో మద్యం మత్తులో డ్రైవర్ హల్చల్.. ఇద్దరికి గాయాలు..

ఆర్.బి.ఎం సంగారెడ్డి: సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. పని ముగించుకొని ఇంటికి వెళుతున్న ఇద్దరు వ్యక్తులపైకి వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా డ్రైవర్ సంఘటన స్థలం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని ఆ కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.