కాంగ్రెస్ వీడితే…కొత్త పార్టీ పెడతా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ వీడితే…కొత్త పార్టీ పెడతా: జగ్గారెడ్డి

ఆర్.బి.ఎం హైదరాబాద్: కాంగ్రెస్ వీడితే…కొత్త పార్టీ పెడతానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ రోజు రాజీనామా చేద్దామనుకున్నానని, రాజీనామా వద్దు అని సీనియర్ నేతలు ఫోన్ చేసి ఆపారని తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చిన్నతనం నుండే ప్రజలకు సేవచేసే గుణం ఉన్నవాడిని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం తన స్వభావమని తెలిపారు. ఎవరికీ బయపడను, జంకనని తెలిపారు. ‘‘నాపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై పీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం బాధించింది. నాపై కొందరు నేతలు కోవర్ట్ అనే ముద్ర వేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని మా పార్టీ నేతలు కొందరు చూస్తున్నారు. గాంధీ ఫ్యామిలీ అంటే నాకు ఎనలేని గౌరవం. నేను కోవర్ట్ అయితే నా భార్యను ఎమ్మెల్సీగా ఎందుకు పోటీలో పెట్టా. ఉత్తమ్ ,రేవంత్ రెడ్డి వారి జిల్లా లలో అభ్యర్థులను ఎందుకు పెట్టలేదు. ఇప్పుడు కనపడే జగ్గారెడ్డి వేరు.. ఇక కనపడే జగ్గారెడ్డి వేరు’’ అని జగ్గారెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published.