సాయిపల్లవికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మద్దతు

సాయిపల్లవికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మద్దతు

ఆర్.బి.ఎం డెస్క్ : సినీనటి సాయిపల్లవికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మద్దతుగా నిలిచారు. శ్యామ్‌సింగరాయ్‌ మూవీలో దేవదాసి పాత్రలో సాయిపల్లవి నటించింది. దేవదాసిగా సాయి పల్లవి నటనతో పాటు అద్భుతంగా డాన్స్‌ చేశారని కొనియాడారు. మరి కొందరైతే సాయిపల్లవి వేషధారణపై బాడీ షేమింగ్‌‌పై పలు రకాల కామెంట్లు చేశారు. ఈ విషయంపై తమిళసై మాట్లాడుతూ గతంలో తనను కూడా ఇలా ఎంతోమంది ట్రోల్‌ చేశారని తెలిపారు. తనను కూడా అనేక రకాల మాటలతో బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రభావితం కాకుండా ఉండటానికి మనం మహాత్ములం కాదన్నారు. పొట్టిగా, రంగు తక్కువతో పుట్టడం మన తప్పు కాదని చెప్పారు. ప్రతి దానిలో అందం ఉంటుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళలే బాడీ షేమింగ్‌కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు ఉన్న పురుషులు ఇప్పటికీ యువకులుగా పరిగణించబడుతున్నారని, మహిళలు మాత్రం వయో వివక్షను ఎదుర్కొంటున్నారని తమిళసై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.