ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ వాహనాలు పంపిణీ

ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ వాహనాలు పంపిణీ

ఆర్.బి.ఎం సికింద్రాబాద్, సెప్టెంబరు 21 :ప్రభుత్వం అమలు జరిపే సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతానికి చెందినా రవి హేలియోస్ ఆసుపత్రి, దిసేబ్లేడ్ వెల్ఫేర్ ఫౌండషన్ ఛైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ సహకారంతో లాలాపేట ప్రాంతానికి చెందిన సుదర్శన్ కు మూడు చక్రాల మోటార్ బాటరీ వాహనాన్ని ఉచితంగా అందించారు. సితాఫలమండీ లోని ఎం.ఎల్. ఏ. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొని ప్రసంగిస్తూ వికలాంగులను ఆదుకోవడం అందరి బాధ్యత అన్నారు. డాక్టర్ విజయ భాస్కేర్ గౌడ్ వివిధ సేవా కార్యకలాపాలను నిర్వర్తిస్తూ సమాజానికి ఉపకరించేలా కృషిచేస్తున్నారని ప్రశంసించారు. డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ పద్మారావు గౌడ్ అందిస్తున్న సేవలను స్పూర్తిగా మార్చుకున్నామని అన్నారు. తమ దిజేబ్లేడ్ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను వికలంగులకై నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.