రేవంత్ సూపర్ ఫార్ములా… దూసుకుపోతున్న కాంగ్రెస్

రేవంత్ సూపర్ ఫార్ములా… దూసుకుపోతున్న కాంగ్రెస్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫార్ములాతో కాంగ్రెస్ దూసుకుపోతోంది. రేవంత్, పీసీసీ భాధ్యతల చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని వాధించిన నేతలు ఇప్పడు రేవంత్ దూకుడును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఎంతలా పరిస్థితి మారిపోయిందటే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని అనే విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు రేవంత్‌ను దగ్గర నుంచి చూసి నేతలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఆయన ఏకం చేస్తున్నారు. ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కలిసి పోరాడితేనే, ప్రజల్లోకి వెళ్లగలమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆందోళనను ఉధృతం చేయగలమని ఇతర విపక్షాలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగానే ఏడేళ్ల తర్వాత తెలంగాణలో విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిపోరుకు సిద్ధమయ్యాయి. ప్రజా సమస్యలపై ఈ నెల 22న.. టీఆర్ఎస్, బీజేపీ యేతర పార్టీలన్నీ కలిసి హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న జరగనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా కదులతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు ఈనెల 30న తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దళిత గిరిజన దీక్ష పేరుతో దీక్షలు సభలు నిర్వహించిన కాంగ్రెస్ అక్టోబర్ 5న పోడుభూములపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


Leave a Reply

Your email address will not be published.