క్యాసారంలో ఘనంగా వినాయక నిమజ్జనం..

క్యాసారంలో ఘనంగా వినాయక నిమజ్జనం..

ఆర్.బి.ఎం క్యాసారం: పటాన్ చేరు నియోజకవర్గంలోని క్యాసారం గ్రామంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగింది. గ్రామంలోని నగులమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతిని ఈరోజు ఘనంగా నిమజ్జనం చేశారు.సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గణేషుడి శోభాయాత్ర జరిగింది. గ్రామంలోని చిన్న, పెద్ద వయస్సు వారు సందడిగా నృత్యాలు చేస్తు బొజ్జగణపయ్యను గంగ ఒడికి చేర్చారు. శోభయాత్రలో ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.    ఎన్. మల్లేష్ గౌడ్, కె.కుమార్, యు అంజయ్య గౌడ్, సిహెచ్ నారాయణ, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, భిక్షపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, విక్రమ్ రెడ్డి, పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, నాగరాజు గౌడ్, సిహెచ్ పాండు, ఎన్ పవన్ గౌడ్, సాయి గౌడ్, కమలాకర్ రెడ్డి, నవీన్ గౌడ్, ఎన్ చరణ్ గౌడ్, తేజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, క్రిష్ గౌడ్, ధన్ వాసు గౌడ్, విగ్నేష్ గౌడ్ తదితరులు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.