పెద్దఅంబర్‌పేట్‌ చైర్‌పర్సన్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసు జారీ..

పెద్దఅంబర్‌పేట్‌ చైర్‌పర్సన్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసు జారీ..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్నకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ పరిధిలోని 5వ వార్డులో మహావీర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ ఓ బహుళ అంతస్తు నిర్మాణం చేస్తోంది. అయితే బిల్డింగ్‌ అనుమతికి అనుకూలంగా ఎన్‌వోసీ ఇవ్వాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్‌పర్సన్‌, స్థానిక కౌన్సిలర్‌ డిమాండ్‌ చేసినట్లు నిర్మాణదారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. రూ. 32 లక్షలు చెక్కు ద్వారా చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌ పర్సన్‌ చామ సంపూర్ణ, 5వ వార్డు కౌన్సిలర్‌ బొర్ర అనురాధకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.