డ్రగ్స్‌ దందాలో బడా బాబులు

drugs case hyderabad

డ్రగ్స్‌ దందాలో బడా బాబులు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ దందాలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు నైజీరియన్‌ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ టోనీ సంపన్నులను టార్గెట్‌గా చేసుకుని తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వస్తున్నాడు. పబ్‌లు.. క్లబ్‌లు.. ఈవెంట్లకు వచ్చే బడా బాబులను మచ్చిక చేసుకుని, వారిని టోని ముగ్గులోకి దింపుతాడు. ఇలా దేశవ్యాప్తంగా తన డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను టోని విస్తరించాలనుకున్నాడు. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 10 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. శుక్రవారం నుంచి ఐదురోజుల పాటు పోలీసులు టోని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో మరికొందరు సంపన్నుల పేర్లు బయటకు వచ్చే అవకాశాముందని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు టోనీతో పాటు నిరంజన్‌ కుమార్‌ జైన్‌ను అరెస్టు చేశారు. నిరంజన్‌ హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి కాంట్రాక్టులు తీసుకుంటుంటాడు. వెయ్యికోట్ల టర్నోవర్‌ ఉన్న నిరంజన్‌.. టోనీ నుంచి 30 సార్లు పెద్దమొత్తంలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈటా వాషింగ్‌ పౌడర్‌ డిస్ట్రిబ్యూషన్‌తో పరిచయమైన శశావత్‌ జైన్‌ వందల కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇతను కూడా టోనీ నెట్‌వర్క్‌లో ఉన్నాడు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో శశావత్‌ జైన్‌ ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేయాల్సిన పదిమంది నిందితులు కూడా సంపన్నులే కావడం గమనార్హం. ఖాజా మహమ్మద్‌ షాహిద్‌ ఆలం, అఫ్తాబ్‌ పర్వేజ్‌, మహమ్మద్‌ ఆసిఫ్‌ ఆరిఫ్‌ షేక్‌, రెహ్మాన్‌, ఇర్ఫాన్‌, ఫిర్దౌజ్‌, సోమ శశికాంత్‌, సంజయ్‌ గర్డపల్లి, గజేంద్ర ప్రకాశ్‌, అలోక్‌జైన్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.