క్యాసారంలో ట్రాన్స్ఫార్మర్ దొంగలించిన దుండగులు..

క్యాసారంలో ట్రాన్స్ఫార్మర్ దొంగలించిన దుండగులు..

ఆర్.బి.ఎం క్యాసారం: పటాన్ చేరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు గ్రామంలోని సర్వే నెంబర్ 25 లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను నిన్న రాత్రి ఎవరు లేని సమయంలో ట్రాన్స్ఫార్మర్ ను పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులను దుండగులు దొంగలించారు. ఈ రోజు ఉదయం పొలానికి వెళ్లిన రైతులు పగిలిపోయి కిందపడి ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను చూసి ఆందోళనకు గురయ్యారు. స్థానిక రైతులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. దింతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published.