సి సి కెమెరాలను ప్రారంభించిన పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం హైదరాబాద్: శ్రీనివాస్ నగర్ కాలనీలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న సి సి కెమెరాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తమ నియోజకవర్గ అభివృధి నిధుల ద్వారా రూ రెండు కోట్ల మేరకు నిధులను కేవలం సి సి కెమెరాల ఏర్పాటుకు కేటాయించమని పద్మారావు గౌడ్ తెలిపారు. శ్రీనివాస్ నగర్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని అయన తెలిపారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, అధికారులతో పాటు కాలనీ సంఘం ప్రతినిధులు విజయ్, లక్ష్మి, వాసు తదితరులు పాల్గొన్నారు.