నవాబుపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ బంద్..

నవాబుపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ బంద్..

ఆర్.బి.ఎం నవాబుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు,ప్రజాసంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు(సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్ లో భాగంగా నవాబుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుండి భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొని నవాబుపేట్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నవాబుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య మాట్లాడుతు ప్రభుత్వ భూములను ప్రయివేట్ పరం చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని వెంకటయ్య మండిపడ్డారు. పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలను పెంచి పేద మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని అయన అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితులు గుర్తొచ్చారని వారిని మభ్య పేటెందుకే దళిత బంధు పథకం అమలు చేశారని ఆయన అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నవాబుపేట్ మండల కాంగ్రెస్ అద్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.