తెరాస నేత పాడి కౌశిక్ రెడ్డికి GHMC ఫైన్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెరాస పార్టీ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి GHMC లక్ష పదివేల రూపాయలు ఫైన్ విధించింది. పాడి కౌశిక్ రెడ్డి తెరాస పార్టీలో చేరుతున్న నేపథ్యంలో గచ్చిబౌలిలోని తన నివాసం నుండి తెలంగాణ భవన్ వరకు ఫ్లెక్సిలు, బ్యానెర్లు భారీగా రోడ్లకు ఇరువైపుల ఏర్పాటు చేశారు. GHMC ఇవ్వని చూస్తూ కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఈ అంశంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గత రెండు రోజులుగా GHMC కి పిర్యాదు చేసిన ఎవరు స్పందిచలేదని ఈ రోజు కౌశిక్ రెడ్డి తెరాస లో చేరిన అనంతరం బ్యానెర్లు కటౌట్లు తొలగించారని ప్రతి పక్ష నాయకులు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల బ్యానెర్లు రోడ్లపై పెట్టుకుంటే చూసి చూడనట్టు GHMC వ్యవహరిస్తుందని అదే ప్రతిపక్షాలకు సంబంధిచిన వ్యక్తుల బ్యానెర్లను పెట్టిన కొద్దీ సేపటికే GHMC సిబ్బంది తొలగిస్తారని వారు పేర్కొన్నారు.