తెరాస కీలక నేత కాంగ్రెస్ గూటికి..

తెరాస కీలక నేత కాంగ్రెస్ గూటికి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి తెరాస పార్టీ స్థాపించిన క్షణం నుండి నేటి వరకు పార్టీకి ఎన్నో సేవలు అందించిన ఉద్యమకారుడు తెలంగాణ కనీస వేతనాల ఛైర్మెన్ సమ వెంకట్ రెడ్డి తెరాస పార్టీని విడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు బుధవారం అయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా సమ వెంకట్ రెడ్డి ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ను రేవంత్ రెడ్డితో సమక్షంలో కలిశారు.

సమ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలమైన పాత్ర పోషించానని కెసిఆర్ కు నమ్మిన బంటుగా ఉన్నానని అయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఇప్పుడు మర్చిపోయారని సమ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు బలిదానాల ఫలితమే నేటి తెలంగాణ అని సమ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఇంకా పిల్లలకు ఉద్యోగాలు రావడంలేదు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేకే తుది నిర్ణయానికి వచ్చని అయన అన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తే ఎం లాభం అని సమ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. 33 జిల్లాలో ఉన్న తెలంగాణ ప్రయివేటు ఉద్యోగుల కమిటీలను తొందర్లోనే సంప్రదిస్తానని సమ వెంకట్ రెడ్డి తెలిపారు.తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం మరోసారి ఉద్యమం మొదలు పెడతామని సమ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.