పులుమామిడి గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం..

పులుమామిడి గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం..

ఆర్.బి.ఎం పులిమామిడి: గాంధీ జయంతిని పురస్కరించుకొని పులిమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామస్థులకు, మహిళా సంఘాలకు తడి చెత్త, పొడి చేత్త పైన అవగాహన కార్యక్రమం “HR ఫౌండేషన్” ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్ ఇందిరా భారతీ, రిసోర్స్ పర్సన్ వెంకట్ సమక్షంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ విమల రంగారెడ్డి గారు మాట్లాడుతూ పులిమామిడి గ్రామంలో అందరూ తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా వేయాలని కాలువల్లో చెత్త వెయ్యోదని ఈ పద్ధతి పాటించి గ్రామన్ని సంపూర్ణ పారిశుద్ధ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, భానుప్రసాద్, ఉప సర్పంచ్ సుధాకర్, ఎంపీటీసీ తేజస్విని రామకృష్ణ రెడ్డి వార్డు మేంబోర్స్ పాండు రంగా రెడ్డి, ఇబ్రాహీం, విఓఏ గాయత్రి, అంగన్ వాడి టీచర్లు, మహిళా సంఘాలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.