మహాత్మా గాంధీ కలలు కన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ కృషి చేయాలి: విమల రంగారెడ్డి, పులిమామిడి గ్రామ సర్పంచ్

మహాత్మా గాంధీ కలలు కన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ కృషి చేయాలి: విమల రంగారెడ్డి, పులిమామిడి గ్రామ సర్పంచ్

ఆర్.బి.ఎం పులిమామిడి:  నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నవాబిపేట్ మండల్ పరిధిలోని పులిమామిడి గ్రామంలో గ్రామ సర్పంచ్ విమల రంగారెడ్డి  పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విమల రంగారెడ్డి  మాట్లాడుతూ అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్చా స్వాతంత్య్రాలు ప్రసాదించిన మహానాయకులు సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని విమల రంగారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ సుధాకర్, వార్డ్ మెంబర్ బుక్క  ఇబ్రహీం, బి.పాండు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.