ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.10 వేల జరిమానా

ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.10 వేల జరిమానా

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో బుర్గం పహాడ్ పోలీస్ స్టేషన్ లో మహబూబాబాద్ ఎంపీ కవిత పై కేసు నమోదు చేసిన విషయం విధితమే. కాగా శనివారం రోజు ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసును విచారించి ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా ప్రజాప్రతినిధుల కోర్టు విధించింది. ఎంపీ మాలోతు కవిత ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన రూ .10 వేల జరిమానా చెల్లించడంతో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published.