ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి.

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికి వారికీ అమ్మవారిని దర్శనం చేయించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున బారులు తిరి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో బి.జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అయన అన్నారు.కోవిడ్ ఇంకా పూర్తిగా నశించలేదని దాని పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని జనార్దన్ రెడ్డి ప్రజలను కోరారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని ప్రార్ధించానని జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికి బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.