సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగాస్టార్ కొత్త లుక్…

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగాస్టార్ కొత్త లుక్…

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పిక్ వైరల్ అవుతోంది. అదే చిరంజీవి మీసాలు తీసేసి చాలా యంగ్ గా కనిపిస్తున్న ఫోటో. ఈ ఫోటో చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ లాక్ డౌన్ టైమ్ ని మెగాస్టార్ చక్కగా తన ఫిజిక్ కోసం వినియోగించుకున్నారని తెలుస్తోంది. ఎక్కువ టైమ్ చిరు జిమ్ లోనే గడుపుతున్నారట.

అయితే చిరు 64 ఏళ్ళ వయసులో కూడా ఇంత యంగ్ గా కనపడటం ఫ్యాన్స్ తో పాటు అందరిని ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. అయితే ఈ ఫోటో విషయానికి వస్తే ఈ ఫోటోలో ఉన్నది బ్లఫ్ మాస్టర్ సినిమా డైరెక్టర్ గోపి గణేష్. అయితే బ్లఫ్ మాస్టర్ సినిమాని మెగాస్టార్ చూసారట. ఆ సినిమా తనకు బాగా నచ్చటంతో ఆ డైరెక్టర్ ని పిలిపించుకొని పొగడ్తలతో ముంచెత్తారట మెగాస్టార్. సాధారణంగా చిరంజీవి ఏదైనా నచ్చితే వారికి ఫోన్ ద్వారా లేక ఇంటికి రమ్మని వారికి తన విషెస్ ని తెలియజేస్తారు. ఈ సందర్భాన్ని గోపి గణేష్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. తరువాత లూసిఫర్ రీమేక్ ని సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published.