ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మాజీ రాష్ట్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస పార్టీలో ఈటలకు రాజేందర్ కు ఎలాంటి నష్టం జరగలేదని అని కేటీఆర్ అన్నారు. తెరాస పార్టీ గతంలో ఈటలకు టికెట్ కేటాయింపు విషయంలో ఎంతో కష్టంగా ఉన్న ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చిందని కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు.
తెరాస పార్టీలో ఉన్నతమైన పదవుల్లో ఉండి ఈటల ఇతర పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపేవారని కేటీఆర్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురుంచి వారు తీసుకున్న నిర్ణయాలు గురుంచి మంత్రివర్గ సమావేశంలో మాట్లాడితే సరిపోయేది కానీ ఆలా కాకుండా ప్రజల సింపతీ తన పై ఉండే విధంగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడారని కేటీఆర్ అన్నారు. ఈటల పార్టీని విడడంతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
హుజూరాబాద్‌లో జరగబోయే ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా పార్టీల మధ్య జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలే హుజూరాబాద్‌లో భారీ మెజారిటీతో గెలిపిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని ఎవరు ఎం చెప్పిన నమ్మరని తెరాస వైపే ఉంటారని అయన తెలిపారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గడిచిన కాలంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి ఎం చేసిందో చెప్పే దైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరాడు. చిల్లర రాజకీయాలు చేయడం కేవలం బీజేపీ కె సాధ్యపడుతుందని కేటీఆర్ ఎద్దవా చేశారు
తెరాస ప్రభుత్వం పై ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఏమి లేదని కేవలం నిరుద్యోగ సమస్య ముందుకు తీసుకొస్తున్నారని వారికి మాట్లాడేందుకు వేరే సబ్జెక్టు లేదని కేటీఆర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.