దసరాకు భారీగా మద్యం కొనండి.. అబ్కారీశాఖ ఒత్తిడి.. మొత్తుకుంటున్న వ్యాపారులు

హైదరాబాద్‌: అబ్కారీశాఖ భారీ ఆదాయంపై కన్నేసింది. దసరా నేపథ్యంలో మరింత పెద్ద మొత్తంలో మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పండుగకు భారీ మద్యం కొనాలని వైన్‌షాపు యజమాలను అధికారులు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. మొత్తంలో కొనాలంటూ గ్రామాలు, పట్టణాల వారిగా టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఎంత స్టాకు ఉందో మాకు అవసరం లేదు. కానీ దసరాకు మాత్రం పెద్ద మొత్తంలో కొనాలని దుకాణదారులపై అబ్కారీశాఖ ఒత్తిడి పెంచుతోంది. గ్రామాల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా స్టాకు కొనాల్సిందేనని పట్టుబడుతున్నారు.

అయితే మద్యం షాపు యజమానుల వాదన మరోలా ఉంది. దసరా నేపథ్యంలో ముందస్తుగా స్టాకు కొన్నామని, ఇప్పటివరకు ఉన్న స్టాకు సరిపోతుందని, మళ్లీ టార్గెట్లు పెడితే ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగకు ఇప్పటికే గొడౌన్‌లను మద్యం స్టాకుతో నింపి పెట్టుకున్నామని చెబుతున్నారు. అయితే అబ్కారీశాఖ తాజాగా టార్గెట్ పెట్టడంతో షాపు యజమానులు తలలుపట్టుకుంటున్నారు. అధికారుల మాటను కాదని కొనుగోలు చేయకుంటే ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.