హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌కు బెదిరింపులు.. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

ips anjanikumar hyd cp

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌కు బెదిరింపులు.. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సీపీ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి అసభ్యపదజాలంతో దూషించాడు. రెండు రోజుల క్రితం పోలీస్ కంట్రోల్ రూం సిబ్బందికి సీపీ రెండు ఫోన్ నంబర్లను షేర్ చేసి ఆ వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని ఆదేశించారు. సీపీ ఆదేశాలతో కంట్రోల్ రూం కానిస్టేబుల్ సీపీ షేర్ చేసిన నంబర్లకు ఫోన్ చేశాడు. అయితే ఆ వ్యక్తి తన సమస్యను వివరించకుండా అంజనీకుమార్‌ను దూషించాడు. అసలు విషయం కనుక్కునేందుకు కానిస్టేబుల్ ఆ వ్యక్తికి మళ్లీ ఫోన్ చేశాడు. అప్పుడు కూడా సీపీ అంజనీకుమార్ ను బెదిరిస్తూ దూషణలు ప్రారంభించాడు. దీంతో కానిస్టేబుల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సైబర్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సీపీని దూషించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.