వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయిన పులిమామిడి గ్రామానికి చెందిన చాకలి సీను..
ఆర్.బి.ఎం రంగారెడ్డి,నవాబేట్,పులిమామిడి : జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాలలోని చిన్నపాటి వాగులు సైతం ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు ఐదు గంటలుగా కురుస్తున్న వర్షానికి నవాబీపేట్ మండల్ పులిమామిడిలో విషాదం చోటు చేసుకుంది. పులిమామిడి గ్రామానికి చెందిన చాకలి సీను 40 అనే వ్యక్తి గ్రామంలోని హునుమాన్ దేవాలయం సమీపంలోని వాగు దాటే క్రమంలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో ప్రమాదవశాత్తు అందులో పడి కొట్టుకుపోయాడు. స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వేరే గ్రామానికి వెళ్లి తిరిగి పులిమామిడి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం గ్రామస్థులు గాలింపు చర్యలు చెప్పట్టారు ఇంకా సీను ఆచూకీ లభ్యం అవ్వలేదు.