హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క? 

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క?

ఆర్.బి.ఎం హుజురాబాద్: కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొండా సురేఖను హుజురాబాద్ నుంచి నిలబెట్టాలని నిర్ణయం జరిగిందని, త్వరలోనే ఆమెను అధిష్టానం ప్రకటిస్తుందనే ప్రచారం జరిగింది. ఇంతలోనే అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి వచ్చింది. సీతక్క రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నేత కాబట్టి ఆమెను దింపితే కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్ నేతలున్నట్లు చెబుతున్నారు. సీతక్క అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించిందని, పోటీలో తలపడేందుకు సీతక్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటిస్తారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే మోజార్టీ నేతలు కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని సమర్ధించలేదు. సీనియర్ నేత దామోదరం రాజనర్సింహా స్థానికులకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చారు. అయితే సీతక్క అందరికి ఆమెదయోగ్యమైన నేత కాబట్టి ఎటువంటి అభ్యంతారాలు తెలుపకుండా ఆమెను బలపర్చుతారని ధీమాగా ఉన్నారు. ఇక సీతక్క అయితే ఆమె గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా కృషి చేస్తారని ధీమా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.