టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత రాజీనామా.. రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత రాజీనామా.. రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి

ఆర్.బి.ఎం  హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు మరో సీనియర్ నేత షాకిచ్చారు. పీర్జాదిగూడకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రంగన్నగౌడ్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు దుర్గా దయాకర్‌రెడ్డికి పంపిస్తున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగన్న గౌడ్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. పీర్జాదిగూడ మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో కాంగ్రస్ వ్యవహారాలను రేవంత్‌రెడ్డి చూస్తున్నారని చెబుతున్నారు.  రంగన్న గౌడ్ కాంగ్రెస్ చేరడానికి టీఆర్‌ఎస్‌లోని ఆధిపత్య పోరే కారణమని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.