బిర్యానీ ప్రియులకు షాక్… బిర్యానీ తింటే గుండెపోటు! ఎందుకో తెలుసా?

బిర్యానీ ప్రియులకు షాక్… బిర్యానీ తింటే గుండెపోటు! ఎందుకో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: బిర్యానీ ప్రియులకు వైద్యు నిపుణులు ఓ వార్త వెల్లడించారు. బిర్యానీ అందులో వాడుతున్న పదార్థాలపై వైద్య నిపుణులు పరిశోదనలు చేశారు. ఆ పరిశోదనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి ముఖ్యంగా చికెన్ బిర్యానీ తింటున్నవారికి వైద్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. బిర్యానీని అధికంగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రుచిగా ఉందని ఎక్కువగా బిర్యానీ తింటే మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అని అంటున్నారు. రెండు కప్పులు, లేదా ఓ ప్లేటు పరిమాణంలో తింటే ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. రుచిగా ఉందని అధికంగా తింటే మీకు గుండె సంబంధిత వ్యాధులు వస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఇంట్లో చేసుకుని తింటే ప్రమాద స్థాయి తక్కువగా ఉంటుదని చెబుతున్నారు. అక్కడ కూడా పరిమితంగా తినాలని చెబుతున్నారు.

ముఖ్యంగా మాంసాహారంలో చేప చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. చేపల్లో ఉన్న కొలెస్ట్రాల్‌‌, ట్రై గ్లిసరైడ్స్‌‌ బీపీని కంట్రోల్​లో ఉంచుతాయని, అందులో ఒమెగా 3 ఫ్యాట్స్ ఉండడం వల్ల అవి గుండెకు చాలా మేలు చేస్తాయని పేర్కొన్నారు. మటన్, బీఫ్, పోర్క్ వీటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే మనకు గుండె సంబంధిత సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రొయ్యలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సమతుల్యత పాటించాలని చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, ఇతర పోషకాలు మన ఆహారంలో ఉండడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.