కేసీఆర్‌పై 70శాతం వ్యతిరేకత: కొండా విశ్వేశ్వరరెడ్డి

కేసీఆర్‌పై 70శాతం వ్యతిరేకత: కొండా విశ్వేశ్వరరెడ్డి

ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై రాష్ట్రంలో 70 శాతానికి మించి వ్యతిరేకత ఉందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ఎదిగి, రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం కుటుంబ రాష్ట్ర సమితిగా అవతరించిందని దుయ్యబట్టారు. కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేది కాంగ్రెస్‌, బీజేపీ అని స్పష్టంగా చెప్పలేమని, ప్రజల్లో మాత్రం కేసీఆర్‌కు వ్యతిరేక ఓటు తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌, బీజేపీలలో తాను ఎందులో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. టీఆర్‌ఎస్‌పై పడమటి నుంచి తూర్పు వరకు ప్రజా వ్యతిరేకత ఉందని, మంచి అవకాశం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.