డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉల్లిపాయ తింటే ఏమౌతుందో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉల్లిపాయ తింటే ఏమౌతుందో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్: డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వారు తినే ఆహారం డయాబెటిస్ మీద చాల ప్రభావం చూపుతుంది. అందువలన డయాబెటిస్ ని నియంత్రణ చేసే ఆహారాలను తినడం శ్రేయస్కరం.

ప్రతి రోజు ఇంట్లో ఉపయోగించే ఉల్లిపాయ డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి కొంతమేరకు సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో  చాల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే బ్రతికి ఉన్నన్ని రోజులు మందులు వేసుకోవాల్సిందే. డయాబెటిస్ ను నియంత్రణ చేసే పలు ఆహారాలను తమ వంటల్లో చేర్చుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజు ఎదో ఒక సమయంలో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను తింటే మంచిది.

కార్బోహైడ్రేట్లు ఉల్లిపాయలో తక్కువగా ఉండుట వలన తక్కువ కార్బో డైట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో విచ్ఛిన్నమై జీర్ణమయ్యేటప్పుడు, రక్తప్రవాహంలోకి చక్కెర విడుదలను ఆలస్యం చేస్తూ ఉంటుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారిలో మలబద్దకం సమస్యను కూడా ఉల్లిపాయ తగ్గిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.