ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు..
ఆర్.బి.ఎం హైదరాబాద్: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఇస్కాన్ స్వామి ప్రభునామామృతదాస్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు. శ్రీకృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కొడుకులా మారి అనేకమంది తల్లుల పాలు తాగారని తద్వారా ఆదర్శ పురుషుడు కాగలిగారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యజనని కార్యక్రమం ఇంఛార్జ్ డాక్టర్ అనుపమ మాట్లాడుతూ గర్భం ధరించడానికి ముందునుంచే సదాలోచనలుండాలని చెప్పారు. వెయ్యి రోజుల ప్రణాళిక ఉండాలన్నారు. తల్లిపాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు యత్నించిన కౌన్సిలర్లను, తల్లిపాలు డొనేట్ చేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి, ప్రముఖ సంఘ సేవకులు కాశీనాధ్ లక్కరాజు, కోఠి మహిళా కళాశాల పోషకాహార విభాగం అధిపతి డాక్టర్ సంతోషి, ఎన్‌ఐటీ డాటాకు చెందిన ప్రసాద్ తిప్పరాజు, ఆర్యజనని టీమ్ మెంబర్ క్లినికల్ సైకాలజిస్ట్ వృషాలి తదితరులు పాల్గొన్నారు.