బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ కు వికారాబాద్ లో పౌర సన్మానం..

బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ కు వికారాబాద్ లో పౌర సన్మానం..

ఆర్.బి.ఎం డెస్క్: తెలంగాణ ఉద్యమ నాయకులు బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ కు ఈ నెల 9 న పౌర సమాజం వికారాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో సన్మానం చేయనున్నారని కే శ్రీనివాస్. N.దేవదాస్. చిగుళ్ల పల్లి రమేష్ కుమార్. దావలగారి ప్రభాకర్ రెడ్డి ముత్తార్ షరీఫ్ టీ శంకర్. మోహన్ గౌడ్ తదితరులు తెలిపారు. పౌర సమాజం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ. మలిదశ ఉద్యమానికి ఉస్మానియా ఊపిరి పోసింది. ఉస్మానియాతో ప్రభావం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఎంతో ఉంది. హైదరాబాద్ కేంద్రం జరిగిన ప్రతి ఆందోళనలో రంగారెడ్డి జిల్లా పాత్రం ఎంతో ఉంది. ఎందుకుంటే ప్రతి ఆందోళన వెనుక రంగారెడ్డి జిల్లా క్రియాశీలమైన పాత్ర వహించింది. జిల్లాపై ఉద్యమ ప్రభావం ఉండదు అనుకుంటున్న సమయంలో కూడా రంగారెడ్డి జిల్లాలోని సకల జనులు కెరటంలా ఎగిసిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని అనేక పోరాట, ఆరాటాకు కేంద్రబిందువు అయింది. వికారాబాద్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు శుభప్రద్ పటేల్. ఈయన వికారాబాద్ కేంద్రంగా అనేక ఉద్యమాలు నడిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శుభప్రద్ పటేల అలుపెరగని పోరాటం చేశారు. ఆయనపై అనేక అక్రమకేసులు పెట్టారు. పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన ఎన్ని కేసులు నమోదు చేసిన అయన మాత్రం ఉద్యమాన్ని అపలేదు. ఆయన ప్రభావం రంగారెడ్డి జిల్లాలోని యువతపై ఉంది. ఆ ప్రభావం ఎంతంటే ఆయన పిలుపుతో కొన్నివేల మంది వెంట ఈ బాటలో నడిచారు. అంతేకాదు ఒవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు రాజకీయ పోరాటంలో శుభప్రద్ పటేల్ పాత్ర చాలా గొప్పది. రాజకీయ పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడయ్యారు. కేసీఆర్ పిలుపుతో పటేల్ ఎన్నో కార్యక్రమాలు చేశారు. పటేల్ తెగువను, చొరవను చూసిన కేసీఆర్.. ‘ఉద్యమపులి’ అని సంబోంధిన సందర్భాలెన్నో ఉన్నాయి

ఈ నేపథ్యంలో యావత్ వికారాబాద్ పౌరసమాజం శుభ ప్రద్ పటేల్ కు ఆత్మీయ పౌర సన్మానం చేయాలని నిర్ణయించిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 9 వ తేదీన ఉదయం 10 గంటలకు. స్థానిక గెస్ట్ హౌస్ నుండి బసంత్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని వారు తెలిపారు . అనంతరం సన్మాన కార్యక్రమం భోజన వసతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు . ఈ కార్యక్రమానికి. జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ఉద్యమంలో పాల్గొన్న వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ,విద్యార్థి, న్యాయవాద,వ్యాపార, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పౌర సమాజం సభ్యులు కోరారు.

Leave a Reply

Your email address will not be published.