హరీష్‌రావు ఎదుటే కొప్పుల ఈశ్వర్‌కు అవమానం

హరీష్‌రావు ఎదుటే కొప్పుల ఈశ్వర్‌కు అవమానం

ఆర్.బి.ఎం హుజురాబాద్: హుజురాబాద్ గౌడ గర్జన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అవమానం జరిగింది. హుజురాబాద్‌లో గౌడ గర్జన సభ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్‌ఛార్జీ హరీష్‌రావు ఈ సభకు ముఖ్య అతిథుల లిస్టులో ఉన్నారు. ముఖ్య అతిథుల్లో ఒకరైన ఈశ్వర్ సభకు వచ్చారు. సభావేదికపైకి వచ్చిన ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌తో పాటు ఇటీవల టీఆర్‌ఎస్ చేరిన నేతల్లంతా వేదికపై దర్జాగా కూర్చున్నారు. ఈ క్రమంలో వేదికపైకి ఈశ్వర్‌ను ఆహ్వానించారు. అయితే అప్పటికే వేదికపైన ముందు వరుసలో కుర్చీలు నిండిపోయాయి. ఇక చేసేదేమీ లేక కొప్పుల ఈశ్వర్ చివరన కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published.