ఈ విపత్కర పరిస్థితిలో పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 1500 ఇవ్వాలి: సీతక్క,ములుగు ఎమ్మెల్యే

ఈ విపత్కర పరిస్థితిలో పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 1500 ఇవ్వాలి: సీతక్క,ములుగు ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిలో ప్రతి పేద కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తన డైనింగ్ టేబుల్ మీదకు చింతచిగురుతో చేసిన రొయ్యలు వస్తాయి కానీ రెక్కాడితే గాని డొక్కాడని పేదవారి పరిస్థితి ఏంటి అని ఆమె కెసిఆర్ ని ప్రశ్నించింది. పొట్ట కూటికోసం ఎదో ఒక్క పని చేసుకు బతికే పేదవారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ఆమె అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రోజు వారి కూలీలు ఉపాధి కోల్పోవడంతో వారికీ ఒక పుట గడవడం కూడా పెద్ద సమస్యగా మారింది. అలంటి పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పది రోజుల లాక్ డౌన్ సమయానికి గాను వారికీ 1500 రూపాయలు ఇవ్వాలని ములుగు ఎమ్మెలేయే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.