తెలంగాణ రాష్ట్ర కాషాయ దళపతి బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలి: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

తెలంగాణ రాష్ట్ర కాషాయ దళపతి బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలి: బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ఆర్.బి.ఎం డెస్క్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 న నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు ప్రజా సంగ్రామ పాదయాత్ర గా పేరును ఖరారు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద నుండి ప్రారంభమైయ్యే ఈ పాదయాత్ర చేవెళ్ల పార్లమెంట్ లోని నాలుగు నియోజకవర్గాలలో ఐదు రోజుల పాటు కొనసాగుతుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోకి నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున పాదయాత్రలో పాల్గొన్ని పాదయాత్రను విజయవంతం చేయాలనీ బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవినీతి,కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర’ను చేపట్టనున్నారని జనార్దన్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తెరాస పార్టీ లబ్ధిపొందేందుకే దళిత బంధు పథకం ప్రవేశపెటిందని జనార్దన్ రెడ్డి ఆరోపించారు. దళితుల సంక్షేమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఎందుకు ఇవ్వడం లేదని జనార్దన్ రెడ్డి ప్రభుత్వాని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేదలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి వద్దకు వెళ్లి తెలుసుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర’ చేయనున్నారని జనార్దన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ప్రజా సంగ్రామ యాత్ర’తో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడుతుందని, రాబోయే సాధారణ ఎన్నికల్లో తెరాస పార్టీకి తగిన గుణపాఠం చెపుతుందని జనార్దన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున కదలి రావాలని జనార్దన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ జనార్దన్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published.