హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా..!

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారనే అనే అంశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలువురి నేతల పేర్లు పరిశీలించింది. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈ నెలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె పేరు ప్రకటిస్తారని కొండా సురేఖ కుటుంబానికి సన్నిహితులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొండా సురేఖ దంపతులు సామజిక వర్గానికి చెందినవారు కావడంతో వారికి ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉండటం వల్లే కొండా సురేఖను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు అని సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గంలో 28 వేల పద్మశాలి ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మున్నూరుకాపు ఓట్లు 18 వేలు ఉన్నాయని అవి కొండా దంపతులకు రాజకీయంగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెరాస పార్టీ,బీజేపీ పార్టీ అభ్యర్థులకు భినంగా కాంగ్రెస్ పార్టీ మహిళకు ఇచ్చినట్లు ఆవుతుందని ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షడు రెడ్డి కూడా కొండా సురేఖ వైపే మొగ్గు చుపిస్తునట్లుగా సమాచారం. కొండా సురేఖ కొద్దీ రోజుల క్రితం కమలాపురం కాంగ్రెస్ ఇంచార్జి గా బాధ్యతలు దక్కడంతో అప్పటి నుండి ఆమె పై ఊహాగానాలు వచ్చాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే గట్టి పోటీ ఇవ్వగలరో ఆ నాయకుల పై జరిపిన సర్వేల అనంతరం కొండా సురేఖ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలదని రేవంత్ రెడ్డి భావించినట్టుగా సమాచారం.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నపుడు జమ్మికుంట,కమలాపూర్ ప్రాంత ప్రజలతో ఆమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.