దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన దద్దమ్మ : అద్దంకి దయాకర్

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన దద్దమ్మ : అద్దంకి దయాకర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న దద్దమ్మ కేసీఆర్ అంటూ రావిర్యాలలో ఏర్పాటు చేసిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దగా చేసిన కేసీఆర్ ఈరోజు లక్షా 70 వేల కోట్ల రూపాయలు నువ్వు ఒకేసారి ఇస్తానంటే నిన్ను ఎలా నమ్మాలని దళిత సమాజం  ప్రశ్నిస్తుందని అద్దంకి దయాకర్ అన్నారు.

మీరు మంత్రులు కాదు కంత్రీలు అని టిఆర్ఎస్ మంత్రులపై అద్దంకి దయాకర్ మాటల తూటాలు పేల్చారు. టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇకపై అలా మాట్లాడే వారికీ వాతలు పెడతామంటూ అద్దంకి దయాకర్ అన్నారు. దళితుల్లో టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత రావడం వల్లే ఈరోజు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని ఆయన అన్నారు. ఇండియా టుడే సర్వే ప్రకారం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అద్దంకి దయాకర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.