తాండూర్ తెరాస పార్టీకి భారీ షాక్..కాంగ్రేస్ పార్టీలో చేరిన తాండూర్ MLA ఫైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అనుచరుడు

తాండూర్ తెరాస పార్టీకి భారీ షాక్..కాంగ్రేస్ పార్టీలో చేరిన తాండూర్ MLA ఫైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అనుచరుడు

ఆర్.బి.ఎం: టీఆరెస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రేస్ పార్టీలో చేరిన తాండూర్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అనుచరుడు యాలాల్ మండలం కోప్షన్ మెంబర్,
వికారాబాద్ జిల్లా కోప్షన్ మెంబర్ ల సంఘం అధ్యక్షులు అక్బర్ బాబ. ఆయనతో పాటు మరో 50మంది తెరాస పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూర్ ని అభివృద్ధి పరచడంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విఫలం అయ్యారని రాబోవు రోజుల్లో రోహిత్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ ఖండువా కప్పుకున్నారు.

ఈ సందర్బంగా అక్బర్ బాబ మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి పేరుతొ పార్టీ ఫిరయించి తాండూర్ ప్రజలనే కాకుండ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూర్ లో అభివృద్ధి ఆగిపోయింది వర్గపోరు పెరిగిందని ఆయన విమర్శించారు.

రాబోవు రోజుల్లో టీఆరెస్ పార్టీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాండూర్ టీఆరెస్ పార్టీలో తనతోపాటు ఇంకా చాలా మంది కార్యకర్తలు అసహనంతో ఉన్నారని త్వరలో వాళ్ళు కూడా కాంగ్రేస్ గూటికి వస్తారని అన్నారు. రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో తిరిగి కాంగ్రేస్ పార్టీలో చేరడం చాలా సంతోషమని వచ్చే ఎన్నికల్లో తాండూర్ లో కాంగ్రేస్ జెండా ఎగరేస్తామని ఈ సందర్బంగా ధీమావ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.