చిరంజీవి, పవన్ నాకు ఓటు వేస్తారు: మంచు విష్ణు

చిరంజీవి, పవన్ నాకు ఓటు వేస్తారు: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. విమర్శలు, ఫిర్యాదులతో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, హీరో మంచు విష్టు ప్యానల్‌లు పోటీలో తలపడుతున్నాయి. నిన్న ప్రకాష్‌రాజ్ ప్యానల్ నామినేషన్ దాఖలు చేసింది. నేడు మంచు విష్టు ప్యానల్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఫిలిం ఛాంబర్‌లో ఉన్న దర్శకుడు దాసరినారాయణరావు విగ్రహానికి పూల మాల వేసి అనంతరం ర్యాలీగా వెళ్లి విష్ణు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ తన మేనిఫోస్టో చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు హీరో పవన్ కల్యాణ్ తనకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను చిత్ర పరిశ్రమ వైపు ఉన్నానని చెప్పారు. ‘మా’లో ఉన్న 900మంది నాకు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవిగారు, పవన్‌గారు వచ్చి నాకే ఓటు వేస్తారు. నాకు నమ్మకం ఉంది. నాన్నగారి గురించి పవన్‌కల్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇస్తారు’’ అని మంచు విష్ణు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.