చేనేత అభివృద్ధే లక్ష్యంగా పోరాడిన వ్యక్తి రాపోలు ఆనంద్ భాస్కర్
హైదరాబాద్: తన ఒంట్లోని నరాలని దారాలుగా చేసి తన చెమటను రంగులుగా మార్చి మలిచే వాడు చేనేత అలాంటి వారు ఎంతో మంది చేనేత కళాకారులు నేడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నరు. చేనేత కార్మికుల కళానైపుణ్యాని కష్టాన్ని యావత్ దేశానికి తెలియపరిచేందుకు ఉపయోగపడే జాతీయ చేనేత దినోత్సవం రాపోలు ఆనంద భాస్కర్ కృషి వల్లే సాధ్యపడిందని సాక్ష్యత్తు కేంద్ర ప్రభుత్వ అధికారులే తమ లేఖల ద్వారా వివరించారు. మద్రాస్ పట్టణంలో తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015వ సంవత్సరం ఆగస్ట్ 7న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిన జాతీయ చేనేత దినోత్సవా కార్యమానికి ముఖ్య అతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అప్పటి కేంద్ర వస్త్ర జౌళి శాఖ మాత్యులు సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ తో పాటు కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ర్ట మంత్రులు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చేనేత కళాకారులు పాల్గొన్నారు. 2015 వ సంవత్సరం ఆగస్ట్ 7న మొదలైన జాతీయ చేనేత దినోత్సం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నాయి.
రాపోలు ఆనంద భాస్కర్ కి అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి లేఖ..
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రవేశపేడుతున్న సంక్షేమ పధకాలు ఇంకా వారికి ఎలాంటి నిధులు ఇవ్వాలి తదితర విషయాల గురించి అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా లేఖలు రాసి రాపోలు ఆనంద భాస్కర్ గారి సలహాలు తిసుకునేవారు.
చేనేతలు ఎదురుకుంటున్నా సవాళ్ళను పార్లమెంట్ సాక్షిగా గళం విప్పిన నాయకుడు..
చేనేత కార్మికుల అభివృద్ది కోసం జాతీయ చేనేత దినోత్సవం సాధించడమే కాకుండా వారి వృత్తికి ఎదురౌతున్న సవాళ్ళను పార్లమెంట్ సాక్షిగా గళం విప్పిన నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధానం ప్రవేశపెట్టనప్పుడు చేనేత మరనేత ఉత్పత్తులపై ముడి సరుకులపై ఉన్న పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తు ఆనంద్ భాస్కర్ గారు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆనంద భాస్కర్ గారు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఎన్నో సార్లు వ్యక్తిగతంగా కలిసి తమ వర్గానికి న్యాయం చేయలని సూచించి తదనంతర జీఎస్టీ సమీక్షలో 18 శాతం ఉన్న పన్నుని 5 శాతానికి తగ్గించే విధంగా రాపోలు ఆనంద భాస్కర్ గారు కృషి చేశారు.
చేనేత అభివృద్దికి ఎంతో కృషి చేసిన అయన తాను చేసింది ఏమి లేదు ఇంకా చేయల్సింది చాలా ఉందనే స్వభావంతో తన పదవీ కాలం ముగిసిన రోజు రాజ్యసభలో వీడుకోలు భాషణలో తన వదవిని ఆయన సాధించిన ఘనకార్యాలను ఘనకీర్తిని చేనేత వర్గాలకు అంకీతం ఇచ్చిన మహానాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ అందుకేనేమో వారి సేవలను గుర్తించి వారిని వరించింది సంసద్ రత్న బిరుదు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్