వైఎస్ షర్మిల అరెస్ట్

 

వైఎస్ షర్మిల అరెస్ట్

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రతి మంగళవారం వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు. ఈ మంగళవారం బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిర్వహించాలని అనుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్రనాయక్ కుటుంబాన్ని పరామర్శించి.. బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ అక్కడ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి నుంచి వైఎస్సార్‌టీపీ శ్రేణులు నిరసన చేస్తున్నారు.రవీంద్రనాయక్ కుటుంబాన్ని పరామర్శించి దీక్ష స్థలికి షర్మిల వచ్చారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. షర్మిలను ఘటకేసర్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.

Leave a Reply

Your email address will not be published.